శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 28 మార్చి 2023 (12:09 IST)

ఇంటర్ ద్వితీయ ఫిజిక్స్ ప్రశ్నపత్రంలో తప్పులు.. ఓ ప్రశ్నకు 2 మార్కులు

exams
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ద్వితీయ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షల్లో భాగంగా, సోమవారం ద్వితీయ భౌతిక శాస్త్రం పరీక్ష జరిగింది. ఇందులో తెలుగు మాధ్యమ ప్రశ్నపత్రంలో మూడో ప్రశ్నగా అయస్కాంత ప్రవణత (అవపాతము)ను నిర్వహించుము? అని రాగా, ఆంగ్ల మాధ్యమ ప్రశ్నపత్రంలో మాత్రం డిఫైన మ్యాగ్టిక్ డిక్లినేషన్? అని తప్పుగా ప్రచురితమైంది. దానికి డిఫైన్ మ్యాగ్నటిక్ ఇన్‌క్లినేషన్ ఆర్ యాంగిల్ ఆఫ్ డిప్? అని రావాల్సివుంది. 
 
దీనికి పరీక్ష కేంద్రాలకు బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ నుంచి సందేశాలు పంపించారు. కొన్నిచోట్ల ఆ విషయం విద్యార్థులకు చెప్పగా, మరికొన్నిచోట్ల ఆ విషయం వారికి చేరలేదు. నంద్యాల జిల్లా డోన్‌ పట్టణ సమీపంలోని ఆదర్శ కళాశాల పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు నిర్వాహకులు ఈ విషయం చెప్పకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. తప్పుగా వచ్చిన ప్రశ్నకే తాము సమాధానం రాశామని ఆవేదన వ్యక్తం చేశారు.
 
ఈ నేపథ్యంలో ప్రశ్న తప్పుగా రావడాన్ని పరిగణనలోకి తీసుకొని ఇంటర్మీడియట్‌ రెండో ఏడాది భౌతికశాస్త్రం పరీక్షలో ఆంగ్ల మాధ్యమ విద్యార్థులకు రెండు మార్కులను కలుపనున్నారు. ప్రశ్నపత్రంలోని మూడో ప్రశ్నకు జవాబు రాసినా, రాయకపోయినా 2 మార్కులు ఇవ్వాలని ఇంటర్‌ విద్యామండలి నిర్ణయించింది.