శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 22 జనవరి 2020 (12:53 IST)

మోడల్‌ స్టేట్‌గా ఏపి: నోబెల్ అవార్డు గ్రహీత సత్యార్ధి కైలాస్ (video)

ముఖ్యమంత్రి వైయస్‌.జగన్మోహన్‌రెడ్డితో చాలా మంచి సమావేశం జరిగిందని నోబెల్  అవార్డు గ్రహీత సత్యార్ధి కైలాస్ అన్నారు. ఇవాళ జగన్‌ను కలిసిన కైలాస్ పలు అంశాలపై ఆయనతో చర్చించారు.

ముఖ్యంగా  ప్రభుత్వం పాఠశాల విద్యార్ధులకు అందిస్తున్న పలు కార్యక్రమాలు గురించి ఈ సందర్భంగా చర్చకు వచ్చాయన్నారు. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న గ్రామసచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్ధ బాగుందని ఆయన అన్నారు.

ప్రధానంగా పేదమహిళలకు చేయాతనిచ్చే అమ్మఒడి కార్యక్రమాన్ని ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమం అమలు ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒక మోడల్‌ రాష్ట్రంగా మిగిలిపోతుందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమాలకు తమ సంస్ధ తరపున కూడా అన్ని రకాల సహాయ, సహకారాలందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ఛైల్డ్‌ ఫ్రెండ్‌ స్టేట్‌ అన్న ఆయన.. ఈ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల వల్ల చిన్నారులకు కుల, సాంఘిక వివక్ష లేకుండా విద్య అందుతుందని తాను భావిస్తున్నాన్నారు. 

ఆంధ్రప్రదేశ్‌ కచ్చితంగా పిల్లలు మంచి విద్య పొందేందుకు అవకాశాలున్న రాష్ట్రంగా నిలుస్తుందన్నారు. యువముఖ్యమంత్రి సారధ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి చిన్నారి ఆనందంగా ఉంటారని భావిస్తున్నానన్నారు.