బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 జనవరి 2023 (18:04 IST)

ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌పై బదిలీ వేటు

sunil kumar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌పై బదిలీ వేటు వేసింది. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత సీఐడీ చీఫ్‌గా కొనసాగుతున్న సునీల్ కుమార్.. వైకాపా రెబెల్ ఎంపీ రఘురామరాజును పోలీసులతో కొట్టించడంలో కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు వచ్చాయి. అలాగే, పలువురు టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు కూడా చేశారు. 
 
ఇలా, సునీల్ కుమార్‌పై అనేక రకాలైన ఆరోపణలు వచ్చినప్పటికీ వైకాపా ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ క్రమంలో సీఐడీ విభాగంలో అదనపు డీజీ హోదాను కల్పించింది. ఇపుడు ఆయన్ను బదిలీ చేస్తూ, సాధారణ పరిపాలనా విభాగం (జీఏడీ)లో రిపోర్టు చేయాలంటూ ఆదేశించింది. అదేసమయంలో సునీల్ కుమార్ స్థానంలో సీఐడీ అదనపు డీజీగా అగ్నిమాపక శాఖ డీజీ సంజయ్‌కు అదనపు బాధ్యతలను అప్పగించింది. 
 
వైకాపా అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్ల కాలంలో సీఐడీ పేరు, సునీల్ కుమార్ పేర్లు ఎక్కువగా వినిపించాయి. ఈ క్రమంలో ఆయన్ను బదిలీ చేయడం అదికూడా సాధారణ పరిపాలన విభాగంలో రిపోర్టు చేయాలని ఆదేశించడం ఇపుడు రాష్ట్ర వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.