ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 ఫిబ్రవరి 2024 (18:24 IST)

విలన్లు చంద్రబాబు అండ్‌ కో రూపంలో ఉన్నారు.. సీఎం జగన్

jagan
రామాయణం, మహాభారతంలో ఉన్న విలన్లు చంద్రబాబు అండ్‌ కో రూపంలో ఉన్నారని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో మనమే విజయం సాధించాలని సీఎం వైఎస్ జగన్ అన్నారు. 
 
చంద్రబాబు మూడుసార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు మీకోసం ఏం చేశాడు? ఏనాడైనా ఒక్క రూపాయి అయినా వేశాడా? అని దెందులూరు సిద్ధం వేదిక నుంచి ప్రతిపక్ష నేతను సీఎం వైఎస్‌ జగన్‌ నిలదీశారు.
 
శనివారం ఏలూరు జిల్లా దెందులూరులో వైఎస్సార్‌సీపీ ఎన్నికల శంఖారావం సభలో జగన్ మాట్లాడుతూ.. మన పార్టీని మరోసారి గెలిపించుకునేందుకు మరోసారి మీరంతా సిద్ధమేనా? అని సీఎం జగన్‌ కేడర్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. 
 
పేదల భవిష్యత్తులను, పేదల్ని కాటేసే యెల్లో వైరస్‌ మీద.. కనిపిస్తున్న కరోనా లాంటి ఆ దుష్టచతుష్టయంపై సంగ్రామానికి ప్రతీ ఒక్కరూ సిద్ధమేనా ? అని సీఎం జగన్‌ ప్రశ్నించారు.