ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 నవంబరు 2024 (10:26 IST)

ఢిల్లీలో పవన్ కళ్యాణ్ 'తుఫాన్' - నేడు ప్రధాని మోడీతో భేటీ!!

pawan - dhankar
హస్తిన పర్యటనలో ఉన్న జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బిజీబిజీగా గడుపుతున్నారు. తాను నిర్వహిస్తున్న శాఖలకు చెందిన కేంద్ర మంత్రులతో పాటు.. తన పరిధిలోకి రాని శాఖలకు చెందిన కేంద్రమంత్రులతో కూడా ఆయన తన పర్యటన తొలి రోజున సమావేశమయ్యారు. రెండో రోజైన బుధవారం ఉదయం 10.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీకానున్నారు. పార్లమెంట్ భవన్‌లో ప్రధాని మోడీ - పవన్ కళ్యాణ్‌‍ల సమావేశం జరుగుతుంది. 
 
అలాగే, బుధవారం సాయంత్రం రెండు తెలుగు రాష్ట్రాల ఎన్డీయే ఎంపీలకు పవన్ విందు ఇవ్వనున్నారు. వారికి తాజ్ హోటల్‌లో విందు ఏర్పాటు చేశారు. ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన ఎంపీలతో పాటు తెలంగాణాలో బీజేపీ ఎంపీలను పవన్ కళ్యాణ్ ఈ విందుకు ఆహ్వానించారు. 
 
మరోవైపు, మంగళవారం ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కర్‌తో సమావేశమయ్యారు. దీనిపై పవన్ స్పందిస్తూ, ఉపరాష్ట్రపతిని కలవడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. బిజీ షెడ్యూల్‌లోనూ తనకు సమయాన్ని కేటాయించినందుకు ఉపరాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. ఆయన తనకు ఎన్నో విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారని, తనకు సాదర స్వాగతం పలికిన ఉపరాష్ట్రపతికి ధన్యవాదజాలు తెలుపుతున్నట్టు తన ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు.