ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో 14 వేల పోస్టుల భర్తీకి చర్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగన్నాయి. దీంతో నిరుద్యోగ యువతను తమ వైపునకు ఆకర్షించేందుకు వీలుగా ఏపీ ప్రభుత్వం పలు రకాలైన పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీచేస్తుంది. గత మూడున్నరేళ్లుగా మిన్నకుండిపోయిన ఏపీ సర్కారు ఇపుడు మాత్రం ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం చర్యలు చపట్టింది. ఇందులోభాగంగా, ఏకంగా 14 వేల పోస్టుల భర్తీ కోసం సిద్ధమవుతుంది. దీనికి సంబంధించిన నోటఫికేషన్‌ను త్వరలోనే జారీచేయనుంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ 14 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీకి వైకాపా ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. ఈ పోస్టుల భర్తీలో భాగంగా, వచ్చే జూన్ నెలలో రాత పరీక్ష నిర్వహించాలని భావిస్తుంది. అయితే, దీనిపై వచ్చే వారం రోజుల్లో తుది నిర్ణయం తీసుకోనుంది. అన్ని అనుకున్నట్టుగా సాగితే గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 14523 పోస్టులను భర్తీ చేయనున్నారు.