గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (13:27 IST)

కోవిడ్ స‌మ‌యంలో ప‌నిచేశాం...ప‌ట్టించుకోరా? ఆశా వ‌ర్క‌ర్లు

దేశం విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఉండ‌గా, కోవిడ్ కాలంలో ప‌నిచేశాం, మ‌మ్మ‌ల్ని ప్ర‌భుత్వం ప‌ట్టించుకోదా? అంటూ ఆశావ‌ర్క‌ర్లు నిర‌స‌న తెలుపుతున్నారు.

నెల్లూరుజిల్లా వింజమూరులో ఆశా వ‌ర్క‌ర్లు నిర‌స‌న‌కు దిగారు. గత 14 సంవత్సరాలు నుండి ప్రజల ఆరోగ్యం పట్ల అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నాం. అయినప్పటికీ ప్రభుత్వాలు తమ పట్ల సరైన నిర్ణయం తీసుకోకపోగా, తమ సేవలను ఏమాత్రం గుర్తించడం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 
 
కోవిడ్ సమయాలలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నాం. అయినా గుర్తింపు ఏది అని ప్ర‌శ్నిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ధీటుగా తమకు కూడా వేతనాలు కల్పించాల‌ని, ప్రభుత్వ పధకాలు అన్నింటిలో ఆశా కార్యకర్తలను భాగస్వాములుగా పరిగణలోకి తీసుకోవాల‌ని డిమాండు చేస్తున్నారు.

అపరిష్కారంగా ఉన్న తమ సమస్యలను వెంటనే ప్రభుత్వాలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆశా కార్యకర్తలు భారీ సంఖ్య‌లో స్థానిక పాత ప్రభుత్వాసుపత్రి వద్ద నిరసనకు దిగారు. మండల ఆశా కార్యకర్తల యూనియన్ నాయకురాలు పల్లాపు అరుణ, ఇత‌ర ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.