ఆనందయ్య మందుపై ఉత్కంఠ : ఐసీఎంఆర్ బృందం నెల్లూరుకు రావట్లేదు..
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామంలో ఆయుర్వేద వైద్య నిపుణుడు ఆనందయ్య మందు కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా సంచలనం రేగుతోంది. కరోనా నివారణకు తయారు చేసిన మందును క్షుణ్ణంగా పరీక్షించే నిమిత్తం సోమవారం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) బృందం రానుందనే వెలువడ్డాయి.
అయితే, ఐసీఎంఆర్ బృందం రావడం లేదని నెల్లూరు జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ బృందం ఎప్పుడ వస్తుందన్న దానిపై క్లారిటీ రావల్సి ఉందన్నారు. జనం నుంచి అనూహ్య మద్దతు నేపథ్యంతో శాస్త్రీయ అధ్యయనం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
ఈ నేపథ్యంలో త్వరగా పరీక్షలు చేసి నివేదిక వెంటనే వచ్చేలా చూడాలంటూ భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించి ఆదేశాలివ్వడం కరోనా రోగులకు కొండంత స్వాంతన కలిగించిన విషయాలు తెలిసిందే.
ఈ నేపథ్యంలో నివారం ఆయుష్ ఆయుర్వేద డిపార్టుమెంట్ పరిశీలన జరిపింది. మిగిలిన అధ్యయనం కోసం ఇవాళ ఐసీఎంఆర్ బృందం ఆధ్వర్యంలో జరగాల్సి ఉంది. అధ్యయనం చేసేందుకు కృష్ణపట్నం వస్తుండటంతో ఇందుకోసం దేశమంతా అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.