శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 22 నవంబరు 2021 (11:41 IST)

కడప, తిరుపతిలో చంద్రబాబు పర్యటన..

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మంగళ, బుధవారాల్లో కడప, తిరుపతిలో పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం కడప, మధ్యాహ్నం తిరుపతిలో పర్యటిస్తారు. బుధవారం నెల్లూరులో బాబు పర్యటన వుంటుంది. భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రజలను పరామర్శిస్తారు. 
 
ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులపై శనివారం రోజున టీడీపీ నేతలతో చంద్రబాబు సమీక్షించిన సంగతి తెలిసిందే. భువనేశ్వరిపై చేసిన కామెంట్లతో చంద్రబాబు నాయుడు తీవ్రంగా కలత చెందారు. ఇక అసెంబ్లీలో అడుగుపెట్టనని ప్రతీన చేశారు. సీఎం అయితే తప్ప సభకు రానని చెప్పారు.  దీంతో బాబు ప్రజాక్షేత్రంలోకి రానున్నారు. 
 
అలాగే వరద బాధితులకు ఆహారం, మందులు అందించాలని కోరారు. చిన్నపిల్లలకు పాలు, బిస్కెట్లు అందించాలని సూచించారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌తో సమన్వయం చేసుకుని ఐటీడీపీ ద్వారా ఇప్పటికే ఆహారం, మందులు పంపిణీ చేయాలని తెలిపారు. టీడీపీ నేతలు వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి ప్రజలను ఆదుకోవాలని చంద్రబాబు సూచనలు చేశారు.ే