శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 27 ఫిబ్రవరి 2021 (20:46 IST)

ఆంధ్రప్రదేశ్: కొండంత అండగా ముఖ్యమంత్రి సహాయనిధి

బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి  కొండంత అండగా నిలబడుతోందని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శనివారం రాయచోటి పట్టణంలోని  వైసిపి కార్యాలయంలో ముఖ్యమంత్రి సహయనిధి ద్వారా  55 మంది లబ్ధిదారులకు రూ 29.57 లక్షల విలువ చేసే చెక్కులను తహసీల్దార్లు, వైఎస్ఆర్ సీపీ నాయకులుతో కలసి శ్రీకాంత్ రెడ్డి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఆర్థికంగా చితికిపోయిన వారికి ఆ ఇంటి పెద్దకొడుకుగా సీఎం జగన్ కొండంత అండగా నిలిస్తున్నారన్నారు. బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక భరోసా కల్పిస్తోందన్నారు. రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోని లబ్ధిదారులకు ఎన్నికల కోడ్ అనంతరం చెక్కులను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.
 
ముఖ్యమంత్రి సహాయనిధి మండలాల వారీగా లబ్ధిదారుల వివరాలు... గాలివీడు మండలంలో 13 మంది లబ్దిదారులకు రూ 7.08 లక్షలు. వడిసెల వంక కు చెందిన పగిడిపల్లె ఖాదర్ సాబ్ కు రూ 15వేలు, మాలపల్లె కు చెందిన ఎద్దుల జయమ్మకు రూ 18 వేలు, నూలివీడుకు చెందిన షేక్ నాజిన్ కు రూ16 వేలు,నక్కలవారిపల్లె కు చెందిన కుడుమల బయారెడ్డి కుమార్తె భవ్యశ్రీ కు రూ 14వేలు, మూడప్పగారిపల్లె కు చెందినమిట్టపల్లె కృష్ణారెడ్డి కుమార్తె చంద్రకళ కు రూ 45 వేలు, నక్కలవాండ్లపల్లె కు చెందిన నక్కల శంకర్ రెడ్డికి రూ 20వేలు ఇచ్చారు.

గాలివీడుకు చెందిన పసుపులేటి వెంకట రమణకు రూ 1 లక్ష,అరవీటివాండ్లపల్లెకు చెందిన పూలగంటి పుల్లారెడ్డికి రూ 65 వేలు, గాలివీడు మెయిన్ రోడ్డుకు చెందిన వులసల నాగరాజు భార్య శ్రీలతకు రూ 70 వేలు, రవీంద్రనగర్‌కు చెందిన రేవనూరి కృష్ణయ్యకు రూ 50వేలు, శెట్టివారిపల్లెకు చెందిన సోంపల్లె కృష్ణప్రసాద్‌కు రూ 1.25 లక్షలు, గాలివీడు గేట్ కు చెందిన ముల్లా సాబ్ కుమారుడు జిలాన్ బాషాకు రూ 1.30 లక్షలు, సిద్ధవాండ్లపల్లె కు చెందిన పల్లేని సుబ్బరాము భార్య రమణమ్మకు రూ 40 వేలు, లక్కిరెడ్డిపల్లె మండలంలో 5 మంది లబ్ధిదారులకు రూ 2.36 లక్షలు.

అనంతపురం హరిజన వాడ కు చెందిన అరవీటి రమణయ్య భార్య శిరీష కు రూ 55 వేలు, దిన్నెమీదపల్లె కు చెందిన టేకూరి పెద్ద రెడ్డేయ్యకు రూ 6 వేలు, ఆయ్యనవారివీధి కి చెందిన  యాపరాల పుల్లారెడ్డి కుమారుడు రేవంత్ రెడ్డి కి రూ 35 వేలు, మాదిగపల్లె కు చెందిన పిల్లగువ్వల మల్లికార్జున భార్య లక్ష్మీదేవి కి రూ 80 వేలు, దిన్నెపాడు కు చెందిన షేక్ మీరావలి కుమార్తె నసీరా బేగం కు రూ 60 వేలు.
 
రాయచోటి  రూరల్ మండలంలో మంది 9 లబ్ధిదారులకు రూ.5.40 లక్షలు. పుల్లమరాజుగారిపల్లె కు చెందిన కొండూరు సీతారామరాజు భార్య రెడ్డెమ్మ కు రూ 75 వేలు, శ్రీనివాసపురం కు చెందిన గంటా కీర్తి కి రూ 45 వేలు, మొరవపల్లెకు చెందిన దేరంగుల పెద్దయ్య కు రూ 45 వేలు,ఎన్ ఎం రాచపల్లె కు చెందిన సంగమరాజు మనోహర్ రాజు కు రూ 1.60 లక్షలు, నక్కావాండ్లపల్లెకు చెందిన అంబటి పుల్లయ్య భార్య సులోచనకు రూ 70 వేలు, దిగువ అబ్బవరంకు చెందిన జాలా రమేష్ కుమార్‌కు రూ 13 వేలు, ఎర్రమొఱ్ఱముపల్లె కు చెందిన పోలంరెడ్డి ఉన్నతికి రూ 60 వేలు, రెడ్డివారిపల్లెకు చెందిన మారగాని భాస్కర్ భార్య ఉమారాణి కి రూ 21 వేలు, మొరవ వడ్డెపల్లె కు చెందిన కోటకొండ రమణయ్యకు రూ 21 వేలు.
 
సంబేపల్లె మండలంలో 10 మంది లబ్ధిదారులకు రూ 5.02 లక్షలు. గుదియవాండ్లపల్లెకు చెందిన అమృతపురి ఆంజనేయులు కుమారుడు జగదీష్‌కు రూ 70 వేలు, ఎర్రమొఱ్ఱముపల్లె హరిజనవాడకు చెందిన సుండుపల్లె వెంకట రమణ కుమారుడు ఓం ప్రకాష్‌కు రూ 80 వేలు,  మహబూబ్ బాషా స్ట్రీట్‌కు చెందిన షేక్ గౌస్ మొహిద్దీన్ కుమారుడు ఆరీఫుల్లాకు రూ 40 వేలు, అంకంవాండ్లపల్లె కు చెందినఅబ్బవరం గరుడారెడ్డికి రూ 13 వేలు, ఎగువ రాచపల్లెకు చెందిన సంగరాజు విజయభాస్కర్ రాజుకు రూ 30 వేలు, మొరముక్రిందపల్లెకు చెందిన దేవపట్ల చెన్నకృష్ణారెడ్డి కి రూ 90 వేలు, గుణ్ణికుంట్ల కస్పాకు చెందిన పొలిమేర విశ్వనాథ రెడ్డికి రూ 80 వేలు, కొట్రాళ్ల మాదిగపల్లెకు చెందిన కసువు. వెంకటేసుకు రూ 40 వేలు, సుద్దలవాండ్లపల్లెకు చెందిన కమ్మినేని దేవప్రసాద్ కు రూ 19 వేలు, పెద్దబిడికి కి చెందిన బుక్కే రవీంద్ర నాయక్‌కు రూ 40 వేలు.
 
చిన్నమండెం మండలంలో 10 మంది లబ్ధిదారులకు రూ 7.15 లక్షలు. బోరెడ్డిగారిపల్లె కు చెందిన పడమటి కోన.వెంకట సిద్దారెడ్డి కి రూ 20 వేలు, బలిజపల్లె కు చెందిన గాలి రెడ్డిశేఖర్ కు రూ 75 వేలు, కావలివాండ్లపల్లె పల్లె కు చెందిన దుగ్గనపల్లె రామచంద్రారెడ్డి కు రూ 30 వేలు, చిన్నమండెం కస్పా ఆరబ్  స్ట్రీట్ కు చెందిన ఆప్కాన్ ఆయూబ్ ఖాన్ భార్య తస్లీమ్ ఖానం కు రూ 1.50 లక్షలు, దేవగుడిపల్లె కు చెందిన దేరంగుల  రామాంజులుకు రూ 55 వేలు,చిన్నరుసుపల్లె కు చెందిన వేల్పుల పిచ్చయ్య భార్య చిన్నక్క కు రూ 1.25 లక్షలు, దేవలంపేట కు చెందిన ఆవుల సాంబశివ కు రూ 40 వేలు, కురవపల్లె కు చెందిన బుడ్డాలి ఆంజనేయులు కు రూ 90 వేలు, పడమటికొన ఎగువ బలిజపల్లె కు చెందిన ముద్దిసేట్టి శంకర్ కు రూ 80 వేలు, వండాడి కి చెందిన బొమ్మల వెంకటరమణ భార్య లక్ష్మీదేవి కి రూ 50 వేలు.
 
రామాపురం మండలంలోని 8 మంది లబ్ధిదారులకు రూ 2.56 లక్షలు. యర్రంగివాండ్లపల్లెకు చెందిన పోలు తిరుమలేశ్వర్ రెడ్డి కి రూ 45 వేలు, పక్కీరుపల్లె కు చెందిన ఫటాన్ రసూల్ ఖాన్ కు రూ 45 వేలు, చిట్లూరు కు చెందిన సగినాల శివశంకర్ కుమార్తె మమతకు రూ 9 వేలు, రామాపురం కు చెందిన మాసన రామయ్య భార్య శివ మల్లీశ్వరికి రూ 45 వేలు,రామాపురం కు చెందిన బాడేపల్లె నాగాసేశా రెడ్డి కి రూ 40 వేలు, రాచపల్లె కు చెందిన నాగార్జున రాజు కు రూ 20 వేలు, రామాపురం కు చెందిన గాలి నారాయణ కు రూ 16 వేలు విలువ చేసే చెక్కులను అందుకున్నారు.
 
ముఖ్యమంత్రి జగన్ సహకారాన్ని మరువలేం: సీఎం సహాయనిధిఅందుకున్న లబ్ధిదారుల కృతజ్ఞతలు
 
ముఖ్యమంత్రి జగన్ సహకారాన్ని మరువలేమని సీఎం సహాయనిది చెక్కులు అందుకున్న లబ్ధిదారులు  పేర్కొన్నారు.తమకు ఆరోగ్యాలు బాగలేక ,వైద్యానికి అప్పులు చేసి ఖర్చులు పెట్టుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తరుణంలో ముఖ్యమంత్రి సహాయనిది ద్వారా ఆదుకున్నారన్నారు. తమకు నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి జగన్, ఎంతో సహకరించిన చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి లకు లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
 
ఈ కార్యక్రమంలో గాలివీడు, లక్కిరెడ్డిపల్లె  తహసీల్దార్ లు శ్రావణి, తులసమ్మ, ఉప తహశీల్దార్ నారాయణ రావు, జెడ్ పి టి సి అభ్యర్థి మాసన వెంకటరమణ, వైఎస్ఆర్ సీపీ నాయకులు యదుభూషన్ రెడ్డి, వడ్డెర కార్పోరేషన్ డైరెక్టర్ ఆంజనేయులు, సర్పంచ్ లు నాగభూషన్ రెడ్డి,వెంకట రెడ్డి, నూలివీడు ఉమాపతి రెడ్డి, రామాంజులు, వలీసాబ్, వైఎస్ఆర్ సీపీ యువజన విభాగపు రాష్ట్ర కార్యదర్శి సూరం వెంకట సుబ్బారెడ్డి, నాయకులు ధర్మారెడ్డి, ఆదిరెడ్డి, మాజీ ఎం పి టి సి శివశంకర్, సోనీనాయక్, బద్దెనాయక్, విజయకుమార్, వాటర్ షేడ్ చైర్మన్ మహదేవరెడ్డి, పూలుకుంట జనార్ధన రెడ్డి, ఖదీర్ తదితరులు పాల్గొన్నారు.