సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 నవంబరు 2024 (16:52 IST)

ఉచిత గ్యాస్ అందించి.. స్టౌవ్‌పై స్వయంగా టీ పెట్టుకుని తాగిన చంద్రబాబు (Video)

chandrababu naidu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీల్లో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి శుక్రవారం నుంచి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా ఈదురుపురంలోని జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని దీపం-2 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించారు. 
 
లబ్దిదారు శాంతమ్మ ఇంటికి వెళ్లి స్వయంగా ఉచిత గ్యాస్ సిలిండర్‌ అందించారు. అంతేకాకుండా, ఉచిత సిలిండర్ స్టౌవ్‌కు బిగించి, ఆ తర్వాత స్టౌవ్ వెలిగించారు. ముఖ్యమంత్రి అంతటితో ఆగకుండా తానే టీ తయారు చేసి సేవించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ పర్యటనలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబుతో మిగిలిన ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రసంగించారు.