బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 3 జూన్ 2021 (11:54 IST)

చెన్నై ఎక్స్‌ప్రెస్‌కి గుంటూరులో కరెంట్‌ బుకింగ్‌

చెన్నై సెంట్రల్‌ నుంచి గుంటూరు మీదగా హైదరాబాద్‌ వెళ్లే నెంబరు 02603 చెన్నై ఎక్స్‌ప్రెస్‌కి గుంటూరు రైల్వే జంక్షన్‌లో కరెంట్‌ బుకింగ్‌ సౌకర్యం కల్పించారు. రైలు బయలుదేరడానికి రెండు రిజర్వేషన్‌ చార్టులు సిద్ధం అయ్యే వరకే కరెంటు బుకింగ్‌ ఉండేది.

ఆ తర్వాత రైలులో ఎన్ని బెర్తులు ఖాళీలున్నా బుకింగ్‌ చేసుకోవడానికి అవకాశం ఉండేది కాదు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను జెడ్‌ఆర్‌యూసీసీ సభ్యుడు ఉప్పులూరి శశిధర్‌చౌదరి రైల్వేబోర్డుకు  లేఖ ద్వారా నివేదించారు.

దీనిని పరిశీలించిన రైల్వేబోర్డు బుధవారం నుంచే కరెంటు బుకింగ్‌ సౌకర్యాన్ని తీసుకొచ్చింది. దీంతో రైలు గుంటూరులో బయలుదేరడానికి అరగంట ముందు వరకు కూడా అన్ని తరగతుల్లో టిక్కెట్లు బుకింగ్‌ చేసుకోవచ్చు.