రాజీనామాకు వెనుకాడను : వైసీపీ మంత్రి అజాంపాషా

ajam basha
ఎం| Last Updated: శనివారం, 15 ఫిబ్రవరి 2020 (21:08 IST)
వైసీపీ ఎన్డీఏలో చేరే అవకాశముందన్న ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఏపీ మంత్రి అంజాద్‌ బాషా సంచలన వ్యాఖ్యలు చేశారు.

శనివారం కడపలో ఆయన విూడియాతో మాట్లాడుతూ.. ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా ఎంతవరకైనా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

”నాకు పదవులు కాదు..నియోజకవర్గ ప్రజలే ముఖ్యం. ఎన్‌ఆర్‌సీపై కేంద్రం ముందుకెళ్తే రాజీనామాకైనా సిద్ధం. ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడానికి సీఎంను ఒప్పిస్తా.

ఎన్డీయేలో చేరుతామని అసత్య ప్రచారం చేస్తున్నారు. మా ప్రభుత్వం ఎన్డీయేలో చేరే ప్రసక్తే లేదు. 151 సీట్లు గెలిచాం.. ఎందుకు ఎన్డీయేలో కలుస్తాం.

బీజేపీతో భవిష్యత్తులో కూడా కలిసే ప్రసక్తే లేదు. బీసీలు, మైనారిటీల కోసం పనిచేస్తున్న లౌకిక పార్టీ మాది” అని అంజాద్‌ బాషా అన్నారు.
దీనిపై మరింత చదవండి :