ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 25 ఏప్రియల్ 2024 (18:03 IST)

గాయానికి గాలి తగిలితే త్వరగా ఆరిపోతుంది.. లేకపోతే చీము పట్టి సెప్టిక్ అవుతుంది : డాక్టర్ సునీత

jagan
వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీత రెడ్డి ఓ సలహా ఇచ్చారు. ముఖ్యమంత్రిగారికి దెబ్బ తగలడం పట్ల తాను బాధపడుతున్నానని, అయితే, దెబ్బ తగిలిన చోట బ్యాండేజ్ ఉండటం వల్ల చీము పట్టి సెప్టిక్ అయ్యే అవకాశం ఉందన్నారు. అందువల్ల గాయానికి గాలి తగిలేలా చూసుకోవాలని చిన్నపాటి  సలహా ఇచ్చారు.
 
ఈ నెల 13వ తేదీన విజయవాడలో జగన్ చేపట్టిన బస్సు యాత్రలో గుర్తు తెలియని వ్యక్తి ఒకరు గులకరాయితో దాడి చేశారు. ఈ దాడిలో జగన్ నుదుటిపై గాయమైంది. అప్పటి నుంచి ఆయన బ్యాండేజితోనే దర్శనమిస్తున్నారు. దీనిపై వివేకా కుమార్తె డాక్టర్ సునీత బుధవారం స్పందించారు. ముఖ్యమంత్రిగారికి దెబ్బ తగలడం పట్ల తాను బాధపడుతున్నట్టు చెప్పారు. 
 
ఓ వైద్యురాలిగా ఆయనకు ఒక సలహా ఇస్తున్నాను. అలా దెబ్బలు ఏమైనా తగిలితే.. అలా బ్యాడ్‌ఎయిడ్లు, కుట్టుకోవద్దు. బ్యాండ్‌ఎయిడ్లు కడితే లోపల చీముపట్టి సెప్టిక్ అయ్యేందుకు అవకాశం ఉంది. ప్లీజ్ కొంచెం బ్యాండ్‌ఎయిడ్ తీసేయండి. తద్వారా గాయానికి గాలి తగిలి ఎండిపోతుందని. త్వరగా కూడా మానిపోతుంది. ముఖ్యమంత్రిగారికి డాక్టర్లు ఎవరున్నారో నాకు తెలియదు కానీ, ఓ వైద్యురాలిగా ఆయనను అలా చూడటం నాకు బాధేస్తుంది. గాయానికి అలా బ్యాండ్ ఎయిడ్‌‍లు వేయడం అనేది మంచి సలహా కాదు అని వివరించారు.