బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 జనవరి 2022 (15:26 IST)

APలో మళ్లీ భూప్రకంపనలు: రోజు విడిచి రోజు భూమి కంపించడంతో..?

ఏపీలో భూ ప్రకంపనలు జనాలను బయపెట్టాయి. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గ పరిధిలో భూమి కంపించింది. ఇచ్ఛాపురంతో పాటు.. కవిటి, కంచిలి మండలాల్లో తరచుగా భూమి కంపిస్తోంది. 
 
ఈ విషయంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. తాజా ఘటనతో.. ఈ ప్రాంతాల్లో రోజు విడిచి రోజు భూమి కంపిస్తోందని ఆందోళన చెందుతున్నారు.
 
ముందు వచ్చిన ప్రకంపనలు ఆగిపోయాయని ఊపిరిపీల్చుకుంటున్న తరుణంలో మరోమారు భూమి కంపించింది. దీంతో ఆ ప్రాంత ప్రజలు రాత్రంతా నిద్ర లేకుండా గడిపారు.