సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (08:41 IST)

ప్రముఖ ఆశావాది ప్రకాశరావు కన్నుమూత

ప్రముఖ సాహితీవేత్త, కవి, అవధాని, ఆశావాది డాక్టర్ ప్రకాశరావు కన్నుమూశారు. ఆయన వయసు 77 యేళ్లు. అనంతపురం జిల్లా పెనుకొండలోని స్వగృహంలో గురువారం మృతి చెందారు. ఆయనకు గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. 
 
ఈయన 52 యేళ్ల పాటు సాహితీ జీవితంలో 50కి పుస్తకాలు రాశారు. 170కి పైగా అవధానాలు చేశారు. ప్రకాశరావు సాహితీ సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం గత 2014లో పద్మశ్రీ పురస్కారాన్ని అందించి గౌరవించింది. రాష్ట్ర ప్రభుత్వం కళారత్న బిరుదుతో సన్మానించింది. 
 
కాగా, ప్రకాశ రావు మృతి పట్ల రాజకీయ సాహితీ ప్రముఖులు, పలువురు కళాకారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రకాశ రావు తన నేత్రాలను ఇప్పటికే దానం చేసి ఉండటంతో సాయి ట్రస్టు నేతృత్వంలో ఎల్వీ ప్రసాద్ ఐ ఆస్పత్రికి ఆయన నేత్రాలను సేకరించి హైదరాబాద్‌కు పంపించారు. 
 
కాగా, ఈయన రచించిన రచనల్లో పుష్పాంజలి, అంతరంగ తరంగాలు, మెరుపుతీగలు, చెల్లపిళ్ల రాయ చరితము, విద్యా విభూషణ, ఘోషయాత్ర, పోతనల తులనాత్మక పరిశీలనతో పాటు అనువాద గ్రంథాలు, సుబోధిన వ్యాకరణం వంటి రచనలు చేశారు.