1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 17 ఫిబ్రవరి 2022 (18:13 IST)

ఏపీలో మరింతగా తగ్గిన కోవిడ్ పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు మరింతగా తగ్గాయి. ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 528 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
అలాగే, చిత్తూరు, కృష్ణ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. అలాగే, 1864 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 3.29 కోట్ల కరోనా టెస్టులు నిర్వహించారు. అలాగే, రాష్ట్రంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 23,15,030కు చేరుకుంది.