శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: బుధవారం, 12 మే 2021 (22:35 IST)

గన్నవరం హెచ్‌సిఎల్ వద్ద 104 కోవిడ్ కాల్ సెంటర్ సిబ్బంది అవస్థలు

గన్నవరం హెచ్‌సిఎల్ వద్ద 104 కోవిడ్ కాల్ సెంటర్ సిబ్బంది అవస్థలు. మూడు షిప్టుల్లో పనిచేస్తారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు Aషిప్టు. మధ్యాహ్నం 2నుంచి రాత్రి 10గంటల వరకు Bషిప్టు రాత్రి 10గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు C షిప్టు పనిచేస్తారు. షిప్టు కి 90మంది వరకు సిబ్బంది పనిచేస్తారు.

లాక్ డౌన్ కారణంగా సిబ్బంది కోసం ప్రత్యేకంగా విజయవాడ ,ఏలూరు వైపు రెండు ఆర్టీసీ సర్వీసు నడుపుతున్నారు. గత రెండు రోజుల నుంచి ఏలూరు వైపు వెళ్లే ఆర్టీసి బస్సు నిలిపివేశారు.

ఉదయం 6 గంటలకు సిబ్బంది దించిన బస్సు మధ్యాహ్నం బస్సు రాదు. లాక్ డౌన్ కారణంగా ఒక్క వాహనం రోడ్డుపై తిరగదు. వాహనాలు లేక మండుటెండలో దిక్కుతోచని పరిస్థితిలో సిబ్బంది అవస్ధలు పడుతున్నారు.