శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 డిశెంబరు 2019 (16:19 IST)

గురుకులాల్లో అనైతిక కార్యకలాపాలు.. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకు..?

గురుకులాల్లో అనైతిక కార్యకలాపాలు వెలుగులోకి వస్తున్నాయి. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే గురుకులాల్లో చదువుతున్న బాలికలకే లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. ముఖ్యంగా తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులు తమ కింది తరగతి బాలురను లైంగికంగా వేధిస్తున్నారనే ఫిర్యాదులు అందాయి.
 
సెల్‌ఫోన్లలో నీలి చిత్రాలు చూడడం, హార్మోన్ల ప్రభావంతో రాత్రిపూట పక్కపక్కనే పడుకునేటప్పుడు అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనేది ప్రధాన ఆరోపణ. ఇలాంటి గురుకులాల్లో చదువుతున్న పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు, లేదా తల్లిదండ్రులే పాఠశాలలను సందర్శించినప్పుడు వేధింపులు ఎదుర్కొంటున్న పిల్లలు వారి తల్లిదండ్రులతో వెల్లడించడంతో ఈ వ్యవహారం వెలుగులో వచ్చింది. వీటిపై ఫిర్యాదులు పెరుగుతుండడంతో అప్రమత్తమైన అధికారులు దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారు.