గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 28 జనవరి 2019 (13:26 IST)

2 రోజుల క్రితం విధుల్లో చేరిన యువ వైద్యుడు.. ప్రియురాలు నో చెప్పిందనీ...

విజయవాడలో యువ వైద్యుడు ఆత్మహత్య చేసుకున్నాడు. విధుల్లో చేరిన రెండు రోజుల్లోనే ఈ దారుణానికి పాల్పడ్డాడు. రెండేళ్లుగా ప్రేమిస్తూ వచ్చిన యువతి.. ఇపుడు నో చెప్పడాన్ని జీర్ణించుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, విజయవాడలోని సూర్యారావు పేటలో ఉన్న స్టార్ హోమియో ఆస్పత్రిలో ప్రకాశం జిల్లాకు చెందిన విశాల్ యాదవ్ అనే యువ వైద్యుడు రెండు రోజుల క్రితం విధుల్లో చేరాడు. 
 
నిజానికి ఈయన వైద్య విద్యను అభ్యసించే సమయం నుంచే ఓ యువతిని ప్రేమిస్తూ వచ్చాడు. అయితే, విశాల్ వైద్యుడుగా విధుల్లో చేరాడు. ఈ క్రమంలో వారి ప్రేమ వివాహం బెడిసికొట్టింది. 
 
దీంతో విశాల్ ఆస్పత్రిలో ఓ గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆసుపత్రి సిబ్బంది సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.