శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 29 జనవరి 2021 (09:14 IST)

ఏపీలో ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ సిలబస్‌ తగ్గింపు

ఇంటర్‌లో సైన్స్‌ విద్యార్థులకు 2020-21 విద్యాసంవత్సరం ప్రాక్టికల్స్‌ సిలబస్‌ను తగ్గిస్తూ ఏపీ ఇంటర్మీడియట్‌ బోర్డు నిర్ణయం తీసుకుంది.

కరోనాతో పనిదినాలు కుదించడం వల్ల 30శాతం ప్రాక్టికల్‌ సిలబస్‌ను తగ్గిస్తున్నట్లు బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.

సబ్జెక్టుల వారీగా తొలగించిన సిలబస్‌ను బోర్డు వెబ్‌సైట్‌ లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. ప్రాక్టికల్‌ పరీక్ష ప్రశ్నాపత్రం 70శాతం సిలబస్‌తోనే ఉంటుందని తెలిపారు.

తొలగించిన థియరీ సిలబస్‌ను కూడా వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు వివరించారు. దీని పట్ల విద్యార్థులు సంబరపడుతున్నారు