శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 నవంబరు 2023 (09:44 IST)

ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంచిన మాట నిజమే: ధర్మాన

dharmana
ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంచిన మాట నిజమేనని మంత్రి ధర్మాన అంగీకరించారు. పార్వతీపురంలో నిన్న నిర్వహించిన సామాజిక బస్సు యాత్ర సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం బాగా పెరిగిందన్నారు. దీంతో ప్రైవేట్ కంపెనీల నుంచి విద్యుత్ కొనుగోలు చేయక తప్పడం లేదన్నారు. 
 
వినియోగదారుల అవసరాలు తీర్చేందుకు కొనుగోలు చేస్తున్న అదనపు కరెంట్ భారాన్నీ వారే భరించాల్సిందేనని ధర్మాన స్పష్టం చేశారు. 
 
తమకు ఓటేయని ఇతర పార్టీల వారిని లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వాలు హింసిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ధర్మాన స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదని పేర్కొన్నారు.