శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: గురువారం, 9 నవంబరు 2017 (19:12 IST)

అది బాబు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.. జగన్

పాదయాత్రలో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తన పాదయాత్రపై బురదజల్లి వాటిని ప్రసార మాధ్యమాలు ప్రసారం చేయకుండా అధికార పార్టీ అడ్డుకుంటోందని జగన్ ఆరోపిస్తున్నారు. అంతేకాదు చంద్రబాబు తాజాగా ప్ర

పాదయాత్రలో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తన పాదయాత్రపై బురదజల్లి వాటిని ప్రసార మాధ్యమాలు ప్రసారం చేయకుండా అధికార పార్టీ అడ్డుకుంటోందని జగన్ ఆరోపిస్తున్నారు. అంతేకాదు చంద్రబాబు తాజాగా ప్రకటన చేసిన ప్యారడైజ్ పేపర్ పైన స్పందించారు జగన్. విదేశాల్లో తనకు ఒక్క రూపాయి ఉందని నిరూపించినా శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు.
 
చంద్రబాబుకు పదిరోజులు గడువు ఇస్తున్నా, ఇది నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా.. ఒకవేళ నిరూపించకుంటే ముఖ్యమంత్రి పదవికి నువ్వు రాజీనామా చేస్తావా అని సవాల్ విసిరారు జగన్.