శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 2 అక్టోబరు 2021 (16:43 IST)

రంగంపేట‌లో జనసేన కార్యకర్తల రోడ్డు మరమ్మతులు

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రంగంపేట పంచాయతీ పరిధిలోని  శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల ఎదుట  జనసేన పార్టీ కార్యకర్తలు గుంతలు పడ్డ రోడ్లకు  మరమ్మత్తులు చేశారు. అనంతరం జనసేన నాయకులు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో రోడ్డు  పరిస్థితి దారుణంగా ఉందని ప్రభుత్వం రోడ్డు మరమ్మతులపై దృష్టి పెట్టాలని గతంలో సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది అన్నారు. ప్రభుత్వం రోడ్ల నిర్మాణం మీద ఎటువంటి చర్యలు తీసుకోలే పోవ‌డంతో, త‌మ నాయకుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈరోజు చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో గుంతలు పడ్డ రోడ్ల మరమ్మతులు చేశామని తెలియజేశారు.
 
 సినీ నటుడు మోహన్ బాబును ఉద్దేశించి మాట్లాడుతూ మొదట ప్రభుత్వం నుండి విద్యాసంస్థ ముందున్న రోడ్లను బాగు చేసుకొని ఆ తర్వాత మా అసోసియేషన్ బిల్డింగ్ నిర్మాణం చేయాలని ఎద్దేవా చేశారు. ఈ రోడ్డు నిర్మాణానికి కార్యకర్తలతోపాటు ప్రజల నుండి కూడా  మంచి స్పందన వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో  జనసేన కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.