ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 అక్టోబరు 2022 (15:16 IST)

మీ ఎంపీ జిప్పు విప్పి చూపిస్తే లేవని నోళ్ళు.. పవన్ చెప్పు చూస్తే ఎందుకు లేస్తున్నాయ్.?

Kiran royle
Kiran royle
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని విమర్శించేందుకు ఒకరికి మించి ఇంకొకరు వైకాపా నేతలు సిద్ధం అవుతున్నారు. అయితే జనసేన నేతలూ తక్కువేం తిన్లేదన్నట్లు వైకాపా నేతలపై ఫైర్ అవుతున్నారు. 
 
అస్సలేమాత్రం యాక్టివ్‌గా లేని జనసేన నేతలు చాలామంది అనూహ్యంగా తెరపైకొస్తున్నారు. మంత్రుల మీద మండిపడిపోతున్నారు. ఎమ్మెల్యేలను ఏకిపారేశారు. జనసేన నేత కిరణ్ రాయల్ అయితే, కొన్నాళ్ళ క్రితం ఏపీలో సంచలనం సృష్టించిన ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు. 
 
"మీ ఎంపీ జిప్పు విప్పి చూపిస్తే లేవని నోళ్ళు.. పవన్ కళ్యాణ్ చెప్పు చూస్తే ఎందుకు లేస్తున్నాయ్.?"అంటూ ప్రశ్నించడం సంచలనంగా మారింది. 'యుద్ధం' అంటే రాజకీయం అని.. అంతేగానీ, సంజన.. సుకన్యలతో చేసిది కాదంటూ అంబటి రాంబాబుపై ప్రత్యేకంగా సెటైర్లేశారు కిరణ్ రాయల్. ప్రస్తుతం కిరణ్ రాయల్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.