శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (11:16 IST)

పవన్ కల్యాణ్‌పై నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకోం: జనసేన

పవన్ కల్యాణ్‌పై నోరు పారేసుకుంటే  చూస్తూ ఊరుకోబోమని జనసేన అధికార ప్రతినిధి అజయ్ వర్మ వైసీపీని హెచ్చరించారు.

పవన్ కల్యాణ్‌పై పెడన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జనసేన నాయకులు ఆందోళనకు సిద్ధమవుతున్నారని.. ముందస్తు సమాచారం రావడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా జనసేన అధికార ప్రతినిధి అజయ్ వర్మ మాట్లాడుతూ... నిరసన తెలియ చేసే హక్కు తమకుందన్నారు. అయినా పోలీసులు ముందుగానే ఎలా అరెస్టు చేస్తారని అజయ్ ప్రశ్నించారు.

జోగి అవినీతి చరిత్ర ఏమిటో అందరికీ తెలుసన్నారు. వైసీపీ నేతల్లా తాము ఓట్లు కొనుక్కుని గెలవలేదన్నారు. మీ నాయకుడు లాగా అవినీతి చేసి జైలుకు వెళ్లలేదన్నారు.

మీలాగా సంస్కారం మరచి మాట్లాడటం తమ నాయకుడు నేర్పలేదన్నారు. అధికార మదంతో ‌వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారని అజయ్ వర్మ మండిపడ్డారు.