బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 28 డిశెంబరు 2020 (20:11 IST)

ఉపరాష్ట్రపతిని కలిసిన కేశినేని శ్వేత

కృష్ణా జిల్లా పర్యటనలో ఉన్న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని స్వర్ణ భారత్ ట్రస్ట్ నందు కేశినేని శ్వేత మర్యాదపూర్వకంగా కలిసి  ఆశీర్వాదం తీసుకున్నారు.
 
అంతర్జాతీయంగా ఖ్యాతిని సంపాదించిన కొండపల్లి బొమ్మను, దేవుని కళాకృతిని వెంకయ్యనాయుడు గారికి బహుకరించారు. వెంకయ్య నాయుడు యువతే దేశానికి వెన్నుముకని, దేశ అభివృద్ధి యువత చేతిలో ఉందని, కేశినేని శ్వేత ఈ వయసులోనే రాజకీయాలలోకి వచ్చి యువతను ప్రభావితం చేయడం ఆనందదాయకమన్నారు. 
 
ఈ సందర్భంగా కేశినేని శ్వేత కరోనాను జయించిన ఆయన ఆత్మ విశ్వాసం అందరికి ఆదర్శనీయమన్నారు. చిన్నతనం నుండి ఆయనను చూస్తూ,రాజకీయంగా అనేక విషయాలను నేర్చుకున్నామని,  పలు అంశాలను ఉపరాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్ళారు.