శనివారం, 8 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 12 జులై 2021 (22:28 IST)

యలమందలో కత్తి మహేష్ అంత్యక్రియలు, సినీప్రముఖులు ఎందుకు రాలేదు?

సినీ క్రిటిక్, సినీ నటుడు కత్తి మహేష్ అంత్యక్రియలు చిత్తూరు జిల్లాలో జరిగాయి. రోడ్డు ప్రమాదంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో మృతి చెందిన కత్తి మహేష్ పార్థీవదేహాన్ని నిన్న సాయంత్రం స్వగ్రామం చిత్తూరు జిల్లాలోని యలమందకు తీసుకొచ్చారు. 
 
యలమందలో కుటుంబ సభ్యుల మధ్య అంత్యక్రియలు పూర్తి చేశారు. కత్తి మహేష్ మొదటి సంతానం కావడంతో దహనక్రియలను నిర్వహించారు. సినీప్రముఖులెవరూ పార్థీవ దేహాన్ని సందర్సించలేదు. కత్తి మహేష్ భార్య, కొడుకు, అతని తండ్రి, బంధువులు, యలమంద గ్రామస్తుల మధ్య అంత్యక్రియలు జరిగాయి. 
 
కత్తి మహేష్ పార్థీవ దేహాన్ని సందర్సించేందుకు ప్రముఖులు వస్తారని అందరూ భావించారు. దీంతో ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సందర్సకుల అనుమతి కోసం పార్థీవదేహాన్ని ఉంచారు. అయితే ఎవరూ రాకపోవడంతో అంత్యక్రియలను పూర్తి చేశారు. 
 
సినీనటుడిగాను, సినీ విశ్లేషకుడి గాను కత్తి మహేష్ మంచి పేరు సంపాదించారు. సినీపరిశ్రమలో చాలామంది ప్రముఖులతో పరిచయాలు కూడా కత్తి మహేష్‌కు ఉన్నాయి. అయితే ప్రముఖలెవరూ హాజరు కాలేకపోయారు.