గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 26 జూన్ 2020 (21:59 IST)

ఎస్వీబీసీలో కీలక నిర్ణయం, ఏంటది?

తిరుమల శ్రీవారి నిధులతో నడుపబడుతున్న ఛానల్ ఎస్వీబీసీ. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్లో అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలే. గతంలో ఈ ఛానల్లో ప్రైవేటు యాడ్స్ ఎక్కువగా కనిపించడంతో భక్తులు భక్తి ఛానల్లో కూడా ఇలాంటివి ఏంటంటూ ప్రశ్నించారు.
 
ముఖ్యంగా డయల్ యువర్ ఈఓ లాంటి కార్యక్రమాల్లోనే భక్తులు ఉన్నతాధికారులను ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఎస్వీబీసీ ఛానల్ ఎమ్‌డి ధర్మారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. భక్తుల విజ్ఞప్తి మేరకు ఇకపై యాడ్ ఫ్రీ ఛానల్‌గా ఎస్వీబీసీని ప్రకటించారు.
 
ఇకపై యాడ్స్ ఉండవు. ఒకవేళ ఉన్నా ఆధ్యాత్మిక యాడ్స్ మాత్రమే ఉంటాయి. డబ్బులు తీసుకోరు. ఆదాయ వనరుల కన్నా భక్తుల మనోభావాలకే ప్రాధాన్యత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్వీబీసీ ఎమ్‌డి ధర్మారెడ్డి తెలిపారు. ఛానల్ నిర్వహణకు భక్తులు స్వచ్ఛంధంగా విరాళాలు అందిస్తే మాత్రం స్వీకరిస్తామన్నారు ధర్మారెడ్డి.
 
ఇప్పటికే ఎస్వీబీసీ ఛానల్‌కు 25 లక్షల రూపాయలను విరాళంగా భక్తులు అందజేశారు. స్వామివారి పేరు మీద నడుపబడుతున్న ఛానల్‌కు భక్తులందరూ విరివిగా విరాళాలు ఇవ్వొచ్చునని కోరారు.