గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 15 మార్చి 2024 (12:10 IST)

జై భారత్ నేషనల్ పార్టీకి టార్చిలైటును కేటాయించిన ఈసీ

laxminarayana
సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ సారథ్యంలోని జై భారత్ నేషనల్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం టార్చిలైటు గుర్తును కేటాయించింది. రానున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కలిసి ఆ పార్టీకి టైర్చిలైటును ఎన్నికలు గుర్తుగా కేటాయించింది. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థులకు కామన్ సింబల్ కేటాయించటం పట్ల ఈసీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి విశాఖ ఎంపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత సొంత పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. 
 
ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఫ్రంట్ అభ్యర్థిగా తాను విశాఖ ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్టు లక్ష్మీనారాయణ తెలిపారు. విశాఖలోని జై భారత్ నేషనల్ పార్టీ ఉత్తరాంధ్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ప్రసంగించారు. గతంలో జనసేన పార్టీ తరపున తాను విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశానని, ప్రస్తుతం తమ పార్టీ నిర్ణయం మేరకు విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నానని అన్నారు. 
 
ఫ్రంట్ తరపున లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఐఏఎస్ అధికారి జీఎస్ఆర్ఆర్ విజయ్ కుమార్ తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి పోటీ చేస్తారని, ఆల్ తెలుగు ప్రజా పార్టీ నాయకుడు డాక్టర్ కె.శివ భాగ్య రావు బాపట్ల నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారని, ప్రబుద్ధ రిపబ్లిక్ అండ్ పార్టీ అధ్యక్షుడు దాసరి చెన్నకేశవులు కొండేపి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారని లక్ష్మీనారాయణ వివరించారు.
 
లక్షల కోట్ల రూపాయలు బటన్ నొక్కి ప్రజలకు అందించాలని చెబుతున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి కనీసం కొద్ది మందైనా దారిద్రరేఖకు పైకి వచ్చారని చెప్పగలరా విజయ్ కుమార్ ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో యువతకు పెద్దపీట వేసి, రెండు కులాలు నాలుగు పార్టీల పాలనను అంతం చేయాలని ఆయన కోరారు.