సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 21 ఆగస్టు 2019 (08:18 IST)

జగన్ ‘అక్కరకు రాని చుట్టం’.. లోకేష్

సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి అక్కరకు రాని చుట్టంగా మారారన్నారు మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్. ట్విట్టర్ ద్వారా ఎప్పటికప్పుడు విమర్శలతో విరుచుపడే లోకేష్ తాజాగా "ఈ ఏడాది దేశమంతటా అనేక రాష్ట్రాలు వరద కష్టాలను, నష్టాలను ఎదుర్కొన్నాయి.

అయితే ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు వేగంగా స్పందించి వరదబాధితులకు అండగా నిలిచారు. ఇప్పటికే బాధితులకు సాయం ప్రకటించారు. మన ముఖ్యమంత్రి మాత్రం ‘అక్కరకు రాని చుట్టం’లా అమెరికాలో సొంతపనుల్లో యమబిజీగా ఉన్నారు"  అని పోస్ట్ చేశారు.