శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 ఫిబ్రవరి 2023 (19:18 IST)

అన్నదమ్ముల మధ్య అద్దె చెల్లింపు గొడవ.. కత్తితో పొడిచి..?

crime scene
అన్నదమ్ముల మధ్య అద్దె చెల్లింపు గొడవ తారాస్థాయికి చేరుకుని హింసకు దారి తీసింది. అన్నదమ్ముల మధ్య గొడవ ఏమాత్రం తగ్గకపోవడంతో.. ఆవేశానికి గురైన తమ్ముడు తన చేతిలో వున్న చపాతీ కర్రతో తమ్ముడిపై దాడి చేశాడు. దీంతో ఆగ్రహానికి గురై తమ్ముడు కూడా అన్నను కొట్టాడు. 
 
కత్తితో విచక్షణారహితంగా అన్నపై తమ్ముడు దాడికి పాల్పడటంతో అన్న ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్‌లో చోటుచేసుకుంది. 
 
బంజారాహిల్స్ గౌతమ్ నగర్ కమ్యూనిటీ హాల్ సమీపంలో నివసిస్తున్న అస్సాంకి చెందిన ఇద్దరు అన్నదమ్ములు అద్దె చెల్లించే విషయంపై గొడవకు దిగడంతోనే ఈ ఘటన జరిగిందని పోలీసులు ధ్రువీకరించారు. ఈ ఘటనలో తమ్ముడు రంజన్ బోరాని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.