బోట్ ఆపరేటర్స్‌తో మంత్రి అవంతి శ్రీనివాస్
రెండేళ్ల క్రితం గోదావరి నదిలో బోటు బోల్తాపడి పలువురు మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే.. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు.
గురువారం నగరంలో బోట్ ఆపరేటర్స్ మీటింగ్‌లో భాగంగా మంత్రి మాట్లాడుతూ.. జిపిఎస్, లైఫ్ జాకెట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఉండాలని బోట్ ఆపరేటర్స్‌కి సూచించారు. బోట్ ఆపరేటర్స్ తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని వివరించారు.
ఏపీకి మంచి సముంద్ర తీరం, నదులు, ఎకో టూరిజం, ప్రముఖ దేవాలయాలు ఉన్నాయని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో కూడా రోడ్ షోలు నిర్వహిస్తామని, వివిధ ప్రాంతాల్లో 13 స్టార్ హోటల్స్ పెట్టాలని ఆలోచిస్తున్నామని అవంతి తెలియజేశారు.