గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 20 జులై 2019 (12:26 IST)

అభయాంజనేయ స్వామికి మంత్రి ప్రత్యేక పూజలు

అభయాంజనేయ స్వామికి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రత్యేక పూజలు చేశారు. రెండు రోజుల పాటు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా  హనుమాన్ జంక్షన్‌లోని అభయాంజనేయ స్వామి వారిని దర్శించుకున్న దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస రావు, దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి.
 
దేవస్థాన పండితులు స్వామివారికి ప్రత్యేక  పూజలు నిర్వహించారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు స్వామివారి ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు, స్థానిక వైఎస్ఆర్‌సిపి నేతలు, దేవాదాయ అధికారులు పాల్గొన్నారు.