బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 23 డిశెంబరు 2021 (22:36 IST)

శత్రువులంతా ఒక్కటైనా రోజా మాత్రం నవ్వుతూనే.. ఎలా?

రెండుసార్లు మేమే రోజాను గెలిపించాం. నాన్ లోకల్ అయినా ఆదరించాం. పార్టీ కోసం పనిచేశాం. పార్టీ నిర్ణయించిన వ్యక్తి కాబట్టే దగ్గరుండి గెలిపించుకున్నాం. కానీ మమ్మల్ని హీనంగా మాట్లాడుతోంది. కార్యకర్తల్లాగా భావించడం లేదు. అందుకే మా సత్తా చూపిస్తాం.

 
వచ్చే ఎన్నికల్లో మాలోనే ఒక అభ్యర్థి ఉంటాడు. లోకల్ వారికే ప్రాధాన్యత ఇవ్వాలని సిఎంను కోరుతామని రోజా వ్యతిరేకులు స్పష్టం చేశారు. ఇప్పటికే నిండ్ర, పుత్తూరు, విజయపురం, నగరి మండలాలకు చెందిన వైసిపి ఇన్‌ఛార్జ్‌లు ఒక్కటయ్యారు.

 
రోజా ఒకవైపు, ప్రత్యర్థులు మరోవైపు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. కానీ రోజా మాత్రం సొంత పార్టీ నేతల బెదిరింపులకు ఏమాత్రం భయపడం లేదు. 

 
ప్రజల్లో తనకున్న మంచి పేరు, నియోజకవర్గంలో చేసిన అభివృద్థే గెలిపిస్తుందన్న ధీమాతో ఉన్నారు రోజా. ఎంతమంది ప్రత్యర్థులుగా మారినా తన గెలుపును ఎవరూ అడ్డుకోలేరన్న ధీమాలో రోజా ఉన్నారట. అందుకే చిరునవ్వుతో రోజా ముందుకు సాగుతున్నారు. 

 
ఎప్పటిలాగే నియోజకవర్గ పర్యటనలో బిజీగా ఉన్నారు. అభివృద్థి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా రోజా ముందుకు సాగుతున్నారు. అయితే రెండుసార్లు రోజాను గెలిపించిన బలవరమైన వర్గం మాత్రం ఎమ్మెల్యేని వ్యతిరేకిస్తూనే నియోజకవర్గంలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తుండటం పార్టీలోనే చర్చనీయాంశంగా మారుతోంది.