శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: శనివారం, 10 ఫిబ్రవరి 2018 (20:31 IST)

వాణీ విశ్వనాథ్‌కి బిస్కెట్ - రోజాకు జిలేబీ... ఏంటిది..?

ముందస్తు ఎన్నికలు రాకుండానే వైసిపి ఎమ్మెల్యే రోజాకు కష్టాలు వచ్చిపడ్డాయి. అదేంటి.. ఇప్పుడు రోజాకు కొత్తగా కష్టాలు రావడం ఏంటి అనుకుంటున్నారా.. పుత్తూరు నియోజకవర్గంలో తనకు ప్రత్యర్థిగా ఉన్న ముద్దుక్రిష్ణమనాయుడు మరణించడం రోజాను బాగా ఇబ్బందుల్లోకి నెట్టి

ముందస్తు ఎన్నికలు రాకుండానే వైసిపి ఎమ్మెల్యే రోజాకు కష్టాలు వచ్చిపడ్డాయి. అదేంటి.. ఇప్పుడు రోజాకు కొత్తగా కష్టాలు రావడం ఏంటి అనుకుంటున్నారా.. పుత్తూరు నియోజకవర్గంలో తనకు ప్రత్యర్థిగా ఉన్న ముద్దుక్రిష్ణమనాయుడు మరణించడం రోజాను బాగా ఇబ్బందుల్లోకి నెట్టింది. ముద్దుక్రిష్ణమనాయుడు తెలుగుదేశం పార్టీ అయినా సరే ఆయన మరణంతో ఆ కుటుంబంలోని వారికే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు సీటు ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదేకాని జరిగితే ఖచ్చితంగా సానుభూతి ఓట్లతోనే ఆ అభ్యర్థి గెలిచిపోవడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
 
ఇప్పటికే ముద్దుక్రిష్ణమనాయుడు ఇద్దరు కుమారులు భాను, జగదీష్‌‌లు చురుగ్గా పుత్తూరు, నగరి నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. తండ్రితో పాటే రాజకీయాలను నేర్చుకుని తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వీరిలో ఎవరికో ఒకరికి సీటు దక్కనుంది. ఇది కాస్తా రోజాను బాగా ఇబ్బందుల్లో నెడుతోంది. అందుకే ప్రస్తుతం రోజా ఆలోచనలో పడిపోయారు. వేరే నియోజకవర్గం ఎంచుకోవడం మంచిదన్న నిర్ణయానికి వచ్చేసినట్లు తెలుస్తోంది. 
 
మరోవైపు పుత్తూరు నుంచే పోటీ చేయాలని భీష్మించుకుని నారా లోకేష్‌ ద్వారా పావులు కదుపుకుంటున్న వాణీ విశ్వనాథ్‌కు ఇది ఇబ్బందికర పరిస్థితే. ముద్దుక్రిష్ణమనాయుడు మరణంతో ఆయన కుటుంబంలోని ఎవరో ఒకరికి సీటు ఇవ్వాల్సిన పరిస్థితి బాబుకు ఏర్పడింది. దీంతో వాణీ విశ్వనాథ్ కూడా ఇక పోటీలో లేనట్లేనంటున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో అధికారంలో ఉన్న వ్యక్తులెవరైనా చనిపోతే వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి సీటు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ మరణిస్తే ఆ సీటును ఆయన భార్య సుగుణమ్మకే ఇచ్చారు. సానుభూతితోనే సుగుణమ్మ భారీ విజయాన్ని కూడా సాధించారు. దీన్నంటిని గమనిస్తున్న పార్టీ నేతలు వచ్చే ఎన్నికల్లో గాలిముద్దుకృష్ణమనాయుడు కుటుంబంలోని వారే ఎమ్మెల్యే అవ్వడం ఖాయమని చెప్పుకుంటున్నారు.