గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 జూన్ 2021 (17:22 IST)

రెడ్డి కులస్తులను అవమానిస్తున్నారు.. ఆర్ఆర్ఆర్‌పై ఫిర్యాదు

వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఓసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. రెడ్డి కులస్తులను కించ పరిచేలా, అవమానించేలా మాట్లాడుతున్నారంటూ ఆయన జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
 
నిజానికి తనను అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ దారుణమైన రీతిలో వ్యవహరించిందంటూ ఎన్‌హెచ్ఆర్సీకి రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు చేరారు. ఎన్‌‍హెచ్‌‍ఆర్సీ ఛైర్మన్ పీసీ పంత్‌ను కలిసిన రఘురామ తన అరెస్టు నుంచి జరిగిన పరిణామాలను వివరించారు. 
 
ఈ క్రమంలో ఓసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి .. రఘురామరాజుపై ఎన్‌హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. ఇటీవల రెడ్డి సామాజిక వర్గాన్ని అవమానించేలా రఘురామరాజు వ్యాఖ్యలు చేశారంటూ ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
రఘురామ వ్యాఖ్యల తాలూకు వీడియోలను కూడా కరుణాకర్ రెడ్డి మానవ హక్కుల కమిషన్‌కు అందజేశారు. ఈ ఫిర్యాదును కమిషన్ విచారణకు స్వీకరించింది. రఘురామకృష్ణరాజు రాజద్రోహం కేసులో ప్రస్తుతం బెయిల్‌పై విడుదలైన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉంటూ వైద్యం చేయించుకుంటున్నారు.