గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 డిశెంబరు 2021 (16:00 IST)

ఏపీలో రెండో ఒమిక్రాన్ కేసు : తిరుపతిలో నమోదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆదివారం ఒక్క రోజే రెండే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో తొలి కేసు విజయనగరం జిల్లాలో నమోదు కాగా, రెండో కేసు తిరుపతి పట్టణంలో నమోదైంది. బ్రిటన్ నుంచి తిరుపతికి వచ్చిన వ్యక్తికి ఈ వైరస్ నమోదైంది. ఆయనకు జరిపిన జీనోమ్ సీక్వెన్సింగ్‌లో ఒమిక్రాన్ కేసు నమోదైనట్టు తెలిపారు. అయితే, ఈ రోగి వివరాలు తెలియాల్సివుంది. 

 
ఇదిలావుంటే, విజయనగరం జిల్లాలో నమోదైన ఒమిక్రాన్ కేసుపై డీహెచ్ఎంపీ డాక్టర్ రమణ కుమారి మాట్లాడుతూ, ఈ నెల 5వ తేదీన ఐర్లాండ్ నుంచి జిల్లాకు ఓ వ్యక్తి వచ్చాడని, ఆయన విశాఖలోని తన అత్తారింటింకి వెళ్లాడని తెలిపారు. అతనికి టెస్ట్ చేయగా, కరోనా పాజిటివ్ అని తేలిందన్నారు. 

 
అయితే, జీనోమ్ సీక్వెన్సింగ్‌ కోసం ఈ నెల 6వ తేదీన హైదరాబాద్‌కు శాంపిల్స్ పంపగా, ఆ పరీక్షల్లో ఒమిక్రాన్ పాజిటివ్ అని తేలిందన్నారు. కాగా బాధితుడిని 40 మంది కలిశారనీ, వారందరికీ టెస్టులు చేశామని వివరించారు. వారికి నెగెటివ్ వచ్చిందన్నారు. అలాగే ఆయన ఇంటి చుట్టుపక్కల వారికి కూడా ఈ పరీక్షలు చేస్తున్నామని తెలిపారు.  


దేశంలో 33కు చేరిన ఒమిక్రాన్ కేసులు
ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఆదివారానికి దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 33కు చేరింది. అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. 34 యేళ్ల విజయనగరం జిల్లాకు చెందిన వాసికి ఈ వైరస్ సోకింది. 

 
పంజాబ్, హర్యానా ఉమ్మడి రాజధాని అయిన చండీగఢ్‌లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. నవంబరు 22వ తేదీన ఇటలీ నుంచి వచ్చిన 20 యేళ్ళ యువకుడికి ఈ వైరస్ నిర్ధారణ అయినట్టు వైద్యులు వెల్లడించారు. డిసెంబరు 1వ తేదీన అతనికి కరోనా పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్ నిర్ధారణ అయింది. తిరుపతిలో నమోదైన మరో కేసుతో కలుపుకుని మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 33కు చేరింది.