ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 5 జూన్ 2023 (08:47 IST)

No fly zone: శ్రీవారి ఆలయానికి సమీపంలో ఎగిరిన విమానం..

tirumala
ఆగమశాస్త్రం ప్రకారం శ్రీవారి ఆలయం పైనుంచి విమానాలు వెళ్లడం నిషిద్ధం అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయానికి సమీపం నుంచి ఆదివారం ఉదయం ఓ విమానం వెళ్లింది. ఉదయం 8 గంటల నుంచి 08.30 గంటల మధ్యలో ఈ విమానం గుడి పక్క నుంచి వెళ్లినట్లు సమాచారం. 
 
విమానం ఎక్కడ నుంచి బయల్దేరింది.. గమ్యస్థానం ఏంటనేది ఇంకా తెలియరాలేదు. ఇక తాజా ఘటనపై విమానయాన శాఖ అధికారులు టీటీడీ విజిలెన్స్ అధికారులతో చర్చిస్తున్నట్టు సమాచారం.