జోరుగా పోలవరం జల విద్యుత్ కేంద్రం టన్నెల్ తవ్వకం
భారీగా వర్షాలు, వరదలు పోటెత్తుతున్నా, పోలవరం జల విద్యుత్ కేంద్రం పనులు శరవేగంగా సాగుతున్నాయి. పోలవరం జలవిద్యుత్ కేంద్రం ప్రెజర్ టన్నెల్స్ తవ్వకం పనులు ఇటీవలే ప్రారంభమయ్యాయి. జల విద్యుత్ కేంద్రంలో మొత్తం 12 ప్రెజర్ టన్నెల్స్ ఏర్పాటవుతున్నాయి. ఇందులో ఒక్కో టన్నెల్ పొడవు 150.3మీ. వెడల్పు 9మీటర్లు. అతి తక్కువ కాలంలోనే రెండవ టన్నెల్ తవ్వకం పూర్తి చేసిన మేఘా ఇంజనీరింగ్ సంస్ద మిగతా టన్నెల్స్ తవ్వకం పనులు చురుకుగా కొనసాగిస్తోంది.
ఇప్పటికే 21,39,639 క్యూబిక్ మీటర్ల కొండ తవ్వకం పనులు మేఘా కంపెనీ పూర్తి చేసింది. పోలవరం జల విద్యుత్ కేంద్రం కొండ తవ్వకం పనులు దాదాపు పూర్తయ్యాయి. జలవిద్యుత్ కేంద్రంలో 12వెర్టికల్ కల్పన్ టర్బైన్ ,ఒక్కో టర్బైన్ కెపాసిటీ 80 మెగా వాట్లు ఏర్పాటవుతున్నాయి. అదే విధంగా 12 ప్రెజర్ టన్నెల్, వీటికి 12జనరేటర్ ట్రాన్స్ఫార్మర్స్ అమర్చుతున్నారు. ఒక్కో ట్రాన్స్ఫార్మర్ 100మెగా వాట్ల కెపాసిటీ తో ఉంటుంది. టన్నెల్ తవ్వకం పనులను జెన్కో ఎస్ ఈ శేషారెడ్డి, ఈ ఈ లు ఏ.సోమయ్య,సి.హనుమ, మేఘా ఇంజనీరింగ్ సంస్ద వైస్ ప్రెసిడెంట్ రంగరాజన్, జిఎం ముద్దుకృష్ణ, ఎజిఎం క్రాంతికుమార్,రాజేష్ కుమార్, మేనేజర్ మురళి తదితరులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.