సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 30 జులై 2022 (22:00 IST)

సిగ్గు సిగ్గు.. మహిళా కానిస్టేబుల్ కోసం రోడ్డుపైనే కొట్టుకున్న ఖాకీలు

woman
ఓ మహిళా కానిస్టేబుల్ కోసం ఒక సీఐ, మరో కానిస్టేబుల్ బహిరంగంగా కొట్టుకోవడం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పోలీస్ స్టేషన్‌లో చోటుచేసుకుంది. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన పోలీసులే మహిళ కోసం నడిరోడ్డుపై కొట్టుకోవడం అందరూ వేలెత్తి చూపేలా చేసింది.
 
భీమవరం వన్ టౌన్ పోలీస్టేషన్లో ఓ లేడీ కానిస్టేబుల్‌ని రాజేశ్ అనే కానిస్టేబుల్ బైక్ పై లిఫ్ట్ ఇస్తుండటాన్ని సీఐ కృష్ణ భగవాన్ చూసి తట్టుకోలేకపోయాడు. దీనితో ఈ విషయమై కానిస్టేబుల్‌ని ప్రశ్నించి.. అజమాయిషీ చేసే తరుణంలో పర్సనల్ అనే మాట రావడంతో ఆ విషయం కాస్త చినికి చినికి గాలివానగా మారింది. 
 
ఆపై ఒకరిపై ఒకరు దాడిచేసుకునే వరకు వచ్చింది. జిల్లాలో పోలీసుశాఖ పరువుని తీసిన ఈ ఘటన ఉన్నతాధికారులకు కోపాన్ని తెప్పించింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా.. విచారణ చేసిన ఉన్నతాధికారులు సీఐ తప్పుకి పనిష్మెంట్ ఇస్తూ వీఆర్‌కు పంపారు.