సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 25 జులై 2019 (15:03 IST)

సెలవు కోసం తోటి విద్యార్థినిని చంపేందుకు యత్నం.. ఎక్కడ?

ప్రకాశం జిల్లా చీరాల మండలం చెన్నూరులో సెలవు కోసం ముగ్గురు విద్యార్థులు కలిసి సహ విద్యార్థినిని హత్య చేసేందుకు ప్రయత్నించాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని చెన్నూరు పట్టణంలోని కస్తూరిబా గాంధీ విద్యాలయంలో ఒక్కరోజు సెలవు కోసం తోటి విద్యార్థిని చంపేందుకు ముగ్గురు విద్యార్థులు యత్నించారు. శనివారం చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. 
 
శనివారం రాత్రి లంబడిపల్లి గ్రామానికి చెందిన రమాదేవి (12) ఏడో తరగతి విద్యార్థిపై ముగ్గురు ఏడో తరగతి విద్యార్థులు హత్యాయత్నం చేశారు. రమాదేవి కేకలు వేయడంతో అందరూ మేలుకొని వారి నుంచి రమాదేవిని రక్షించారు. పాఠశాల ఉపాధ్యాయుల, రమాదేవి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు హత్యాయత్నం చేసిన విద్యార్థులు పూజా, శ్రీలేఖ, నిందినిలపై కేసు నమోదు చేసి వారిని జువైనల్ హోంకు తరలించారు.