శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 10 డిశెంబరు 2020 (07:17 IST)

ప్రభుత్వ పాఠశాలల్లో పెరుగుతున్న హాజరు: మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం క్రమేపి పెరుగుతోంది. పాఠశాలలు ప్రారంభం నుంచి 40 నుంచి 50 శాతం మధ్య నడుస్తున్న హాజరు క్రమేణా 60 శాతం చేరుకుంటోంది. బుధవారం 8వ తరగతి విద్యార్థులు 57 శాతం హాజరు కాగా కొన్ని చోట్ల 68 శాతం నమోదైంది.  ప్రతిరోజూ 50శాతం తగ్గకుండా విద్యార్థులు తరగతులకు హాజరవుతున్నారు. విద్యార్థుల హాజరుకు సంభందించిన వివరాలను  విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.
 
బుధవారం 10వ తరగతి విద్యార్థులు 52.15 శాతం విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 6,74,733 మందికి గాను 351877 మంది హాజరయ్యారు.9వ తరగతి విద్యార్థులు  శాతం విద్యార్థులు, 6,84,722 మందికి 316032 మంది హాజరయ్యారు. 8వ తరగతి విద్యార్థులు 56.30 శాతం 6,81,917 మందికి గాను 383938 మంది హాజరయ్యారు.

గుంటూరు జిల్లాలో 8వ తరగతి విద్యార్థులు అత్యధికంగా 68.93 శాతం హాజరయ్యారు. కాగా కడపలో 61 శాతం నమోదైంది. గుంటూరు జిల్లాలో 10వ తరగతి విద్యార్థులు కూడా 61శాతం హాజరయ్యారు. పాఠశాలల్లో కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ తరగతులు నిర్వహిస్తున్నాం. ప్రశాంత వాతావరణంలో తరగతులు జరుగుతున్నాయి.

ఇదే విధంగా పాఠశాలలకు తమ పిల్లలను పంపేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతుండటంతో డిసెంబర్ 14 తరువాత 6, 7 తరగతులు కూడా నిర్వహించడం కోసం చర్యలు తీసుకుంటున్నాం.
 
కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ పాఠశాలల్లో, కళాశాలల్లో  విద్యార్థులకు, ఉపాధ్యాయులకు వైద్య పరీక్షలు చేస్తున్నారు.  ప్రతిరోజూ కోవిడ్ పై అవగాహన కల్పిస్తూ ప్రతిజ్ఞ చేయించటం, శానిటైజేషన్, మాస్క్ లు ధరించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.

అన్ని జిల్లాల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ అధికారులను అప్రమత్తం చేస్తున్నాం. పాఠశాలల్లో పారిశుధ్య పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాం. మాస్క్, శానిటైజేషన్, సామజిక దూరం విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాం.