ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 8 ఏప్రియల్ 2021 (10:21 IST)

ఏపీలో మందకొడిగా సాగుతున్న పోలింగ్

ఏపీలోని పలు జిల్లాల్లో మందకొండిగా పోలింగ్ జరుగుతోంది. ముఖ్యంగా ప్రకాశం, పశ్చిమ గోదావరి  జిల్లాల్లో మందకొడిగా పోలింగ్ సాగుతోంది. ప్రకాశంలో ఉదయం 7గంటలకు ప్రారంభమైనా.. 9 గంటల వరకూ కేవలం 6.52 శాతం పోలింగ్ నమోదయ్యింది.

పశ్చిమ గోదావరి జిల్లాలో మొదటి గంటలో కేవలం 3.42 శాతం మాత్రమే పోలింగ్ నమోదవ్వడం గమనార్హం. ఇదిలా ఉంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎంపీటీసీ, జడ్పీటీసీల్లో 7.5 శాతం పోలింగ్ నమోదయ్యింది.

వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట
శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం తంపతాపల్లి పోలింగ్ కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.

రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాల వారికి నచ్చజెప్పడానికి ప్రయత్నించినా వినలేదు. దీంతో ఇరువర్గీయులను పోలీసులు బయటకు పంపేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని.. ప్రశాంతంగానే పోలింగ్ ప్రక్రియ జరుగుతోందని పోలీసులు చెబుతున్నారు.

ఏజెంట్లను గెంటేస్తున్న పోలీసులు
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ ఏజెంట్లను పోలీసులు బయటకు పంపుతున్నారు. ఏజెంట్‌గా కూర్చుంటే కేసులు నమోదు చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి.

మరోవైపు.. కనగానపల్లి మండలం ఎలక్కుంట్ల గ్రామంలో పోలింగ్ కేంద్రం నుంచి టీడీపీ ఏజెంట్‌ను గెంటివేశారు. చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం గ్రామంలోనూ టీడీపీ ఎన్నికల ఏజెంట్ వెంకటేష్‌పై అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు లక్ష్మీరెడ్డి, ఆదినారాయణ దాడికి దిగారు.
 
జిల్లాల వారీగా పోలింగ్ శాతం
సమయం : ఉదయం 9 గంటల వరకు
 
శ్రీకాకుళం : 8.99 %
విజయనగరం : 9.01% 
విశాఖపట్నం : 8.83% 
తూర్పుగోదావరి : 4.59%
పశ్చిమగోదావరి : 3.42% 
కృష్ణ జిల్లా : 9.32%
గుంటూరు : 7.52%
ప్రకాశం : 6.53%
నెల్లూరు : 6.36%
చిత్తూరు : 7.29%
వైఎస్సార్ కడప : 4.81%
కర్నూల్ : 9.58%
అనంతపురం : 9.05%
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 7.6 శాతం పోలింగ్ నమోదు.