ఆదివారం, 24 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. జనరల్ నాలెడ్జ్
Written By ఎం
Last Updated : మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (16:00 IST)

చరిత్రలో ఈ రోజు ఏప్రిల్ 6

సంఘటనలు
1896: 1,500 సంవత్సరాల అనంతరం ఏథెన్స్‌లో మొట్టమొదటి ఆధునిక ఒలింపిక్ క్రీడలు ప్రారంభించబడ్డాయి.
1909: భౌగోళిక ఉత్తర ధ్రువాన్ని మొట్టమొదటి సారిగా రాబర్ట్ పియరీ అనే అమెరికన్ సాహస యాత్రికుడు చేరుకున్నాడు.
1930: మహాత్మాగాంధీ నేతృత్వంలో గుజరాత్ లోని దండి వద్ద ఉప్పు చట్టం ఉల్లంఘన జరిగింది.
 
మార్చి 12 నుండి 1930 ఏప్రిల్ 6 మధ్యకాలంలో అహ్మదాబాదు లోని తన ఆశ్రమము నుండి గుజరాత్ తీరంలోని దండీ వరకూ గల 400 కిలో మీటర్ల దూరం కాలినడకన తన యాత్ర సాగించారు. ఈ యాత్ర దండియాత్రగా లేదా ఉప్పు సత్యాగ్రహంగా ప్రసిద్ధిగాంచింది.
 
జననాలు
1773: జేమ్స్ మిల్, స్కాట్లాండ్‌కు చెందిన చరిత్రకారుడు, ఆర్థిక శాస్త్రవేత్త, రాజనీతి సిద్దాంతకర్త, తత్వవేత్త. (మ.1836)
1886: మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, హైదరాబాదు చివరి నిజాం. (మ.1967)
1922: శ్రీభాష్యం అప్పలాచార్యులు, వక్త, సాహితీ వ్యాఖ్యాత.
1928: జేమ్స్ వాట్సన్, DNAను కనుగొన్న శాస్త్రవేత్త.
1931: నల్లమల గిరిప్రసాద్, కమ్యూనిస్టు నేత. (మ.1997)
1954: ఆడారి వెంకటరమణ (దీపశిఖ), కథా రచయిత.
1956: దిలీప్ వెంగ్‌సర్కార్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
1964: డేవిడ్ వుడార్డ్, అమెరికన్ రచయిత, సంగీతకారు.
 
మరణాలు
1989: పన్నాలాల్ పటేల్, గుజరాతీ భాషా రచయిత.
1992: ఐజాక్ అసిమోవ్, అమెరికన్ రచయిత, బోస్టన్ విశ్వవిద్యాలయంలో జీవరసాయన శాస్త్రం ప్రొఫెసర్. (జ.1920)
2002: భవనం వెంకట్రామ్, ఫిబ్రవరి 24 నుండి సెప్టెంబరు 20 వరకు ఏడు నెలల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు.
2011: సుజాత, దక్షిణ భారత సినిమా నటి. (జ.1952)