గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 27 జనవరి 2022 (14:03 IST)

గుడివాడలో గోవా అమ్మాయిలతో క్యాసినో : సోము వీర్రాజు

సంక్రాంతి సంబరాల్లో భాగంగా గుడివాడలో జరిగిన క్యాసినో రగడ ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. ఈ క్యాసినో అంశాన్ని అడ్డుపెట్టుకుని అధికార వైకాపాపై విపక్ష పార్టీలైన తెలుగుదేశం, బీజేపీ పార్టీలు తీవరస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. 
 
తాజాగా బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ, గుడులు, గోపురాలపై దాడులు చేసిన వారిని ఎందుకు అరెస్టు చేయలేదు. ఎన్నో గుడులు ధ్వంసం చేసిన వారిని ఎందుకు పట్టుకోలేదు. హిందూ మతానికి, సంస్కృతికి వైకాపా అనుకూలమా, వ్యతిరేకమా, ప్రజల డబ్బుతో చర్చిలు, మసీదులు కట్టిస్తున్నారు అంటూ ఆరోపించారు. 
 
స్వయంగా మంత్రులే హిందూ సంస్కృతిని దెబ్బతీసేలా వ్యవహిరిస్తున్నారు. మన సంస్కృతి దెబ్బతినడానికి గుడివాడ క్యాసినో వ్యవహారమే నిదర్శనం క్యాసినో డ్యాన్స్‌ అంటూ విజయవాడకు నానిగారు గోవా నుంచి క్యాసినో డ్యాన్స్‌ చేసే అమ్మాయిలను రప్పించారు. స్కర్ట్‌లు వేసుకునే అమ్మాయిలను రప్పించడం ఏంటి అని అన్నారు. 
 
పైగా, దీనికి సంక్రాంతి సంబరాలు అంటూ కలరింగ్ ఇస్తున్నారని అన్నారు. తనకు తెలిసిన సంక్రాంతి సంబరాల్లో గంగిరెద్దులు, హరిదాసులు, ముగ్గులు పోటీలు ఉంటాయి. పండితులకు సన్మానాలు ఉంటాయి. కానీ, కొడాలి నాని ఇలాకాలో సంక్రాంతి సంబరాల్లో క్యాసినో అమ్మాయిలు ఉంటారన్నారు.