ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 25 జనవరి 2022 (08:41 IST)

డీజీపీ అంటే.. డైరెక్టరేట్ ఆఫ్ జగన్ పార్టీ : బుద్ధా వెంకన్న - రిలీజ్

టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్నను పోలీసులు విడుదల చేశారు. సోమవారం రాత్రి 11.15 గంటల సమయంలో స్టేషన్‌ బెయిలుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా వెంకన్న మరోమారు తీవ్ర స్థాయిలో అధికార పార్టీ, డీజీపీపై ధ్వజమెత్తారు. డీజీపీ అంటే డైరెక్టర్ ఆఫ్ జగన్ పార్టీగా మారిపోయారని ఆరోపించారు. 
 
మంత్రి కొడాని నానికి చెందిన కన్వెన్షన్ సెంటరులో క్యాసినో నిర్వహించినట్టు వీడియోలతో కూడిన సాక్ష్యాధారాలు ఉంటే ఈ పోలీసులు కళ్లు కనిపించక కొడాలి నాని అరెస్టు చేయలేదని ఆరోపించారు. కొడాలి నానికి రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీ అధినేత చంద్రబాబు అని, కొడాలి నాని  వంటి దుర్మార్గులకు టిక్కెట్లు ఇవ్వడం చంద్రబాబు చేసిన పెద్ద తప్పని ఆయన అన్నారు. 
 
పైగా, నాని గత చరిత్ర ప్రతి ఒక్కరికీ తెలుసున్నారు. మరోవైపు వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గారావు ఫిర్యాదు మేరకు బుద్ధా వెంకన్నపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి సోమవారం సాయంత్రం అరెస్టు చేశారు. ఆతర్వాత 4 గంటల విచారణ తర్వాత ఆయన్ను స్టేషను బెయిలుపై విడుదల చేశారు.