మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 24 జనవరి 2022 (19:34 IST)

టిడిపి నేత బుద్ధ వెంకన్న అరెస్ట్; ఇంటికి వెళ్ళి మ‌రీ అరెస్ట్!

విజయవాడలో టిడిపి నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను తమ నివాసంలోనే  పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రి కొడాలి నాని, రాష్ట్ర డిజిపి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై ఘాటు వ్యాఖ్యలు చేశారని వైసీపీ నేతలు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. 
 
 
సెక్షన్ 153ఏ, 506, 505(2), రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వన్ టౌన్ పిఎస్ లో కేసు నమోదు చేసి, బుద్ధా వెంకన్న నివాసానికి వెళ్లి పోలీసులు  వివరణ అడిగారు. అదుపులోకి తీసుకొని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. బుద్ధా వెంకన్నను అరెస్టు చేయడం పట్ల టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు  చేస్తారా అని ప్రశ్నించారు.