శుక్రవారం, 8 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 20 జనవరి 2022 (13:52 IST)

పుట్టు మూగబాలికపై 60 యేళ్ల కామాంధుడు అత్యాచారం

సమాజంలో కామాంధులు పెరిగిపోతున్నారు. అభంశుభం తెలియని చిన్నారుల నుంచి 60 యేళ్ల ముదుసలి వరకు ఏ ఒక్కరినీ వదిలిపెట్టడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. పుట్టుకతోనే మూగ, చెవిటి సమస్యలతో బాధపడుతున్న బాలికపై 60 యేళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన వివరాలను వివరాలను పరిశీలిస్తే, 
 
యూపీలోని ఫర్దాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 60 యేళ్ళ వృద్ధుడు తన ఇంటి పక్కనే ఉండే మూగ, చెవిటి బాలికపై కన్నేశాడు. ఆ బాలికకు స్వీట్లు ఆశచూపి తాను ఉండే టెర్రస్‌పైకి తీసుకెళ్లాడు. 
 
అయితే, చాలాసేపు బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది, చుట్టుపక్కల ఇళ్ళలో గాలించారు. అపుడు ఆ బాలిక పట్ల వృద్ధుడు అసభ్యంగా నడుచుకుండటాన్ని ప్రత్యక్షంగా చూసి, పట్టుకుని చితకబాదారు. ఆ తర్వా పోలీసులకు అప్పగించారు. ఆ కామాంధుడిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.