శ్రీకాకుళం జిల్లాలో పిడుగుపాటుకు నలుగురు దుర్మరణం పాలయ్యారు. జిల్లాలోని వంగర మండలంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, సీతంపేట మండలంలో ఒకరు చనిపోయారు. వంగర మండలంలోని మరణించిన వారిలో అచ్యుతరావు అనే పదో తరగతి విద్యార్థి కూడా ఉన్నారు. నిజానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లాలో సూర్యతాపం తారాస్థాయిలోవున్నది. భానుడు తన ప్రతాపాన్ని చూపాడు. అయితే, సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఫలితంగా ఉరుములు, మెరుపులతో వర్షం...